రూ. 40 వేల కోట్ల భూములు తెలంగాణకే ఇవ్వాలి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి కేటీఆర్ లేఖ


కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు లేఖ రాశారు.  రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను  విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ భూములను రాష్ట్రానికి కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదా ఈ భూముల్లో కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. 
 

Telangana Minister KTT Writes Letter To Union Minister Nirmala Sitharaman

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలంగాణ మంత్రి KTR ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు  ఆదివారం నాడు కేంద్ర మంత్రి Nirmala Sitharaman కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  Letter రాశారు. . హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్‌, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ , ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.

 ఈ ఆరు సంస్థ‌ల‌కు గతంలో సూమరు 7,200 ఎకరాల భూమిని రాష్ట్ర స‌ర్కారు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రభుత్వ ధరల ప్రకారం  ఈ భూముల విలువ కనీసం రూ. 5వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈ ధర 40వేల కోట్లు ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మొద్ద‌ని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను మంత్రి కేటీఆర్  ఆ లేఖలో కోరారు. 

కేంద్ర స‌ర్కారు అమ్మేస్తున్న‌ ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు లేదా సంస్థలను ప్రారంభించాల‌ని మంత్రి కేటీఆర్ లేఖ‌లో కోరారు. లేకుంటే ఆ భూముల‌ను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల‌న్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా భూములను సద్వినియోగం చేసుకుంటామ‌ని చెప్పారు. 

ప్రభుత్వ రంగ సంస్థల్లో disinvestment నిర్ణయాన్ని వెంట‌నే వెనక్కి తీసుకోవాలని కోరారు. Hyderabadనగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవేలాంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర స‌ర్కారు ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడుందని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాల‌రాస్తున్న‌ట్లు ఉంద‌ని మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం మోడీ సర్కార్  బీజీగా ఉందని  కేటీఆర్ విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను BJP  ప్రభుత్వం  అమ్ముతుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును మోదీ స‌ర్కారు ప‌ట్టించుకోలేద‌ని కేటీఆర్ విమర్శించారు. . కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేస్తోందన్నారు.

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతోపాటు Telangana Government ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మరోసారి కేంద్రాన్ని కోరుతున్నామ‌న్నారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేలాది మందికి  ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు విస్తృతమవుతాయన్న సోయి ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు.. ఆయా సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో ప్రైవేట్‌ప‌రం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రైవేట్‌ప‌రం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios