ఆధారాలుంటే బయట పెట్టు, లేకపోతే చట్టపరమైన చర్యలు: బండి సంజయ్ కి కేటీఆర్ వార్నింగ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఆధారాలను బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay ఆరోపణలపై తెలంగాణ మంత్రి KTR సీరియస్ అయ్యారు. బండి సంజయ్ ఆరోపణలను నిరూపించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలనకు సంబంధించిన వీడియోలను కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
also read:తెలంగాణలో మరో దోపిడీకి తండ్రీకొడుకుల స్కెచ్.. అందుకే వరంగల్ రింగ్ రోడ్: మాణిక్యం ఠాగూర్ ఆరోపణలు
Telangana లో కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్ధులు మరణించారని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్ధులు చనిపోతే KCR సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అయితే Intermediate విద్యార్ధుల మృతికి తాను ఎలా కారణమనే విషయమై బండి సంజయ్ ఆధారాలు చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఈ ఆరోపణలపై చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని కూడా కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
హాస్యాస్పదమైన,నిరాధరమైన బాధ్యతారాహితమైన ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని కేటీఆర్ హెచ్చరించారు.ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలుంటే వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కూడా బండి సంజయ్ ను కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు.