Asianet News TeluguAsianet News Telugu

సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు విగ్రహావిష్కరణ చేసిన మంత్రి కేటీఆర్

గాల్వన్ లోయలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో  మరణించిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు ఆవిష్కరించారు.

Telangana minister KTR unveil col Santosh Babu statue in Suryapet lns
Author
Suryapet, First Published Jun 15, 2021, 3:42 PM IST

సూర్యాపేట: గాల్వన్ లోయలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో  మరణించిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు ఆవిష్కరించారు.సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్నిఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.  విగ్రహావిష్కరణ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ సహాయంతో సంతోష్ బాబు విగ్రహానికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు  పూలమాల వేసి నివాళులర్పించారు. 

also read:సూర్యాపేట కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్‌బాబు విగ్రహం: పర్యవేక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి

గత ఏడాది గాల్వన్ లోయలో చైనా ఆర్మీతో ఇండియన్ ఆర్మీకి మధ్య ఘర్షణ చోటు చేసుకొంది చైనా ఆర్మీతో ఇండియన్ ఆర్మీకి మధ్య బాహ బాహీ చోటు చేసుకొంది. పరస్పరంగా ఇరు వర్గాలు దాడలు చేసుకొన్నాయి.ఈ దాడుల్లో ఇండియాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని ఆర్మీ చైనాను నిలువరించింది. ఈ ఘటనలో చైనా ఆర్మీ దాడిలో సంతోష్ బాబు వీర మరణం పొందాడు.కల్నల్ సంతోష్ బాబు  కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సంతోష్ బాబు భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది.   


 

Follow Us:
Download App:
  • android
  • ios