రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌ నిజామాబాద్ వెళ్లినప్పుడు ఆయనను చూడటానికి ఇద్దరు చిన్నారులు పడ్డ పాట్లను వివరించే ఫొటోలను ట్వీట్ చేశారు. 

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నిజామాబాద్ కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం చేశారు. కేసీఆర్‌ను చూడటానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపారు. పార్టీ శ్రేణులు పక్కనపెడితే.. సాధారణ జనం కూడా సీఎం కేసీఆర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఓ తెలుగు పత్రిక ఒక ఆసక్తికరమైన ఫొటోను పబ్లిష్ చేసింది. అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. సభా ప్రాంగణంలో సీఎంను చూడటానికి ఇద్దరు చిన్నారులు ఎన్నో పాట్లు పడ్డారు. గోడ పై నుంచి సీఎంను చూడాలని ప్రయత్నించారు. ఇందుకోసం ఒకరు ఇంకొకరికి సహకరించి సీఎం కేసీఆర్‌ను చూడగలిగారు. ఓ పేపర్ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోను క్లిక్‌మనిపించారు. ఈ ఫొటో సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ చూశారు. ఆ ఫొటోను ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

ఈ రోజు న్యూస్ పేపర్‌లో తాను ఓ క్యూట్ పిక్ చూసినట్టు వివరించారు. నిజామాబాద్‌లోని ఇద్దరు అన్నదమ్ములు సీఎం కేసీఆర్‌ను చూడటానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే, రాజకీయాల ట్వీట్లు సాధారణమే.