Asianet News TeluguAsianet News Telugu

KBC -13 లో కేటీఆర్.. ఆశ్చర్యంగా, సంతోషంగా ఉందంటున్న మంత్రి...

తాజాగా భారత మాజీ క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్,  సౌరవ్ గంగూలీ హాజరైన ఎపిసోడ్లో కేటిఆర్ గతంలో చేసిన ట్వీట్ ప్రశ్న సంధించారు హాట్ సీట్లో ఉన్న అమితాబ్. 

telangana minister ktr tweet as a question in popular reality show quiz kbc
Author
Hyderabad, First Published Sep 4, 2021, 12:45 PM IST

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణా మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికరంగా వార్తల్లో నిలిచారు. సాధారణంగా కోవిడ్ బాధితులు, ఇతర సమస్యలపై చురుగ్గా స్పందిస్తూ అభినందలు అందుకునే కేటీఆర్ పాపులర్ రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్పతి - 13 లో అనూహ్యంగా చోటు సంపాదించుకున్నారు.  

అయితే ఆయన పార్టిసిపెంట్ అనుకుంటే మాత్రం..  మీరు పొరబడినట్లే. విభిన్న అంశాలపై స్పందించిన ఆయన ట్వీట్ కేబీసీలో ఒక ప్రశ్నగా రావడం విశేషంగా నిలిచింది. ఇప్పుడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో కేటీఆర్ ట్వీట్ ను కెబిసి షో నిర్వాహకులు పరిగణలోకి తీసుకున్నారు.

తాజాగా భారత మాజీ క్రికెటర్స్ వీరేంద్ర సెహ్వాగ్,  సౌరవ్ గంగూలీ హాజరైన ఎపిసోడ్లో కేటిఆర్ గతంలో చేసిన ట్వీట్ ప్రశ్న సంధించారు హాట్ సీట్లో ఉన్న అమితాబ్.  దీనిపై స్వయంగా కేటీఆర్ కూడా ఒకింత ఆశ్చర్యాన్ని, మరింత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏదో సరదాగా చేసిన ట్వీట్ ఇలా కేబీసీలో రావడం సంతోషంగా ఉందన్నారు.

కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ లిస్టును తెలంగాణ మంత్రి కేటీఆర్ గతంలో ట్వీట్ చేశారు. వీటిని సరిగ్గా పలికే వారు ఉన్నారా? అంటూ ట్వీట్ చేశారు.  అంతే కాదు దీని వెనక కచ్చితంగా ఈయన హస్తం ఉండే ఉంటుందని  కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిధరూర్ ను  ట్యాగ్‌ చేశారు. ఆ ట్వీట్ ను కేబీసీలో ప్రశ్నగా మారింది.  

కేటీఆర్ ట్వీట్ ను ఎవరికి ట్యాగ్ చేశారంటూ అమితాబ్ కేబీసీలో ప్రశ్నించారు.  సమాధానాల్లోని  నాలుగు ఆప్షన్స్ గా కపిలి సిబల్, సుబ్రమణ్యన్ స్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ పేర్లను ఇచ్చారు.

దీనిపై దాదా సౌరవ్ గంగూలీ, చాలా స్మార్ట్ గా ఆలోచించి శశిధరూర్ అని చెప్పారు. ఇంగ్లిష్పై పట్టు అంటే రాజకీయవర్గాల్లో ఎవరికైనా తక్కువ గుర్తొచ్చే పేరు శశిథరూర్. 

Follow Us:
Download App:
  • android
  • ios