Asianet News TeluguAsianet News Telugu

ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ గల్లంతే: ధర్మపురి అరవింద్ పై కేటీఆర్ ఫైర్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై  తెలంగాణ మంత్రి కేటీఆర్  విమర్శలు  చేశారు. కేంద్రం నుండి ఒక్క పైసా ఇవ్వనందుకే అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాలేదని  ఎంపీపై  మండిపడ్డారు.

Telangana Minister KTR Serious Comments on Nizamabad MP Dharmapuri Arvind lns
Author
First Published Aug 9, 2023, 5:06 PM IST

నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా  ఎక్కడ పోటీ చేసినా  డిపాజిట్ గల్లంతు చేసేందుకు ప్రజలు  సిద్దంగా ఉన్నారని  తెలంగాణ మంత్రి కేటీఆర్  చెప్పారు.నిజామాబాద్ లో  బుధవారంనాడు  పలు అభివృద్ది కార్యక్రమాల్లో  మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రూ.130 కోట్లతో అభివృద్ది కార్యక్రమాలను  ఆయన  ప్రారంభించారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన సభలో ఆయన  ప్రసంగించారు.పెద్దలను గౌరవించడం హిందూ సంప్రదాయం, ఆధునికుల నాగకరికతగా పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీకి  పెద్దలను గౌరవించడం తెలియదన్నారు. మతం గురించి మాట్లాడి రెచ్చగొట్టడం ఒక్కటే తెలుసునన్నారు. 

నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు  పెద్దలను గౌరవించడం తెలియదన్నారు.మతం గురించి మాట్లాడి రెచ్చగొట్టడం ఒక్కటే తెలుసునన్నారు.ఏదో గాలిలో గెలిచిన  అరవింద్ సీఎం కేసీఆర్ ను ఇష్టారీతిలో  మాట్లాడడాన్ని తప్పుబట్టారు.తాము కూడ నిజామాబాద్ ఎంపీ డి.శ్రీనివాస్ ను దూషించలేమా అని ఆయన ప్రశ్నించారు. 60 ఏళ్లలో చూడని  అభివృద్దిని  9 ఏళ్లలో తెలగాణలో చూస్తున్నామని కేటీఆర్ చెప్పారు. వందల కోట్ల అభివృద్ది జరుగుతుంటే  చిత్తశుద్ది ఉంటే ఎంపీ మాతో నిలబడేవారన్నారు.  కేంద్రంలోని బీజేపీ  సర్కార్ నయా పైసా  తెలంగాణకు  ఒక్క పైసా  ఇవ్వలేదన్నారు. అందుకే ముఖం లేక ఎంపీ  నిజామాబాద్ లో  అభివృద్ది పనుల్లో పాల్గొనలేదని ఆయన ఎద్దేవా చేశారు.

రూ. 450 గ్యాస్ సిలిండర్ కు మొక్కాలని  మోడీ చేసిన వ్యాఖ్యలను  ఆయన ప్రస్తావించారు. మోడీ పాలనలో  గ్యాస్ సిలిండర్ ధరను  రూ.1200లకు చేరిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.  ఈ విషయమై బీజేపీ నేతలను నిలదీయాలని ప్రజలకు  కేటీఆర్ సూచించారు. 

 

ధాన్యం ఉత్పత్తిలో  పంజాబ్ ను  తెలంగాణ అధిగమించిందన్నారు.తెలంగాణలో ధాన్యం  ఉత్పత్తి 60 వేల టన్నుల నుండి  3.5 లక్షల టన్నులకు చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఎన్నికలప్పుడు  మాత్రమే వచ్చేవారిని ప్రజలు నమ్మొద్దన్నారు. ఒకప్పుడు నెర్రలు వారిన నేలల్లో నేడు జలధారలు  పారుతున్నాయని  కేటీఆర్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios