బీజేపీ, టీఆర్ఎస్ మధ్య  ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. రెండు పార్టీల నేతలు తమ వాదనలను సమర్దించుకొంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. 

హైదరాబాద్: BJP, TRS మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. సమతామూర్తి కేంద్రంలో రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించడంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నాడు కౌంటరిచ్చారు. కిషన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగానే తెలంగాణ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

Scroll to load tweet…

హైద్రాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో సమతామూర్తి కేంద్రంలో 120 అడుగుల Ramanujacharya విగ్రహాన్ని ప్రధాని Narendra Modi శనివారం నాడు ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోడీకి KCR స్వాగతం పలకలేదు. జ్వరం వచ్చిన కారణంగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని టీఆర్ఎస్ ప్రకటించింది. అయితే ప్రధానికి స్వాగతం పలకకుండా కేసీఆర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని BJP విమర్శలు చేసింది. శనివారం నుండి సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకొంటున్నాయి. కనీస ప్రోటోకాల్ ను కూడా కేసీఆర్ పాటించలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు.

Scroll to load tweet…

 సమతామూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనంగా మారిందన్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో మంత్రి KTR ట్వీట్ చేశారు. వివక్షకు చిహ్నమైన వ్యక్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరించారన్నారు. సమానత్వం దూరం చేసినవాళ్లు ఈ విగ్రహవిష్కరించడం చూసి వ్యంగ్యం కూడా కొన్ని కోట్లసార్లు మరణించిందన్నారు. 

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి KIshan Reddy స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు కౌంటరిచ్చారు. సమానత్వ భావాలను చాటి చెప్పెందుకు ఉద్దేశించిన ఆద్యాత్మిక కార్యక్రమం రాజకీయం కావడం దురదృష్ఖకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రామానుజచార్యులను ఈ విమర్శల నుండి తప్పించాలని ఆయన కోరారు. రాజకీయ విమర్శలకు ప్రధాని మోడీ అలవాటు పడ్డారని కిషన్ రెడ్డి చెప్పారు.

గతంలో ఎంఐఎం నేత Akbaruddin Owaisiచేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఇలాంటి ప్రకటనలను టీఆర్ఎస్ సమర్ధిస్తున్నారన్నారు. రజాకార్ల సైన్యం హిందువులను ఇష్టానుసారం ఊచకోత కోసిన నిజాంను బలపరుస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అంటున్న మోడీని విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు. 

తెలంగాణకు ఇచ్చిన హామీలపై మాట్లాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. కేటీఆర్.అనవసర విషయాలు తెరపైకి తేవద్దని కేటీఆర్ కేంద్రమంత్రికి సూచించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, కాళేశ్వరానికి జాతీయ హోదాపై మాట్లాడాలని కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. కేంద్రం ఐటీఐఆర్ ఇవ్వకున్నా దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తెచ్చుకొన్నామని కేటీఆర్ గుర్తు చేశారు.