హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో చెదిరిపోని ఇమేజ్ వేసుకున్న నేత కల్వకుంట్ల తారకరామారావు అంతా షార్ట్ కట్ లో కేటీఆర్ అని పిలుస్తారు.ముఖ్యమంత్రి కెసిఆర్  తర్వాత ఆ స్థాయిలో క్రేజీ సంపాదించుకున్న నేత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ప్రస్తుతం లేదు.

 రాజకీయాల్లో బిజీగా ఉంటే కేటీఆర్......ట్విట్టర్‌లో ఇంకా యాక్టివ్ అని అందరూ అంటారు. ట్విట్టర్ లో ఆయన స్పందించిన తీరుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దక్కింది...దక్కుతుంది  కూడా.

 

 

సామాజిక, సమకాలీన  విషయాలపై స్పందించడంతో పాటు..ఎవరైనా సహాయం కోసం అభ్యర్థిస్తే వెనకడుగు వేసే సందర్భాలు లేకపోవచ్చని కేటీఆర్ అభిమానులు అంటారు.

వీకెండ్స్ లో వింటేజ్ ఫోటోలను, తన చిన్న నాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..పాత రోజులను గుర్తు చేస్తుంటారు యువనేత. గతంలో ఆయన చిన్నప్పటి నుంచి కాలేజీ రోజుల్లోని  ఫోటోలు....చెల్లి కవిత తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశారు.

 తాజాగా ఆయన  ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న జ్ఞాపకాన్ని ట్విట్టర్ వేదిక ద్వారా అందరితో పంచుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 కేటీఆర్ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు.

ఆ లైసెన్స్ లో ఉన్న కేటీఆర్ ఫోటో పరిశీలిస్తే.... ప్రేమ దేశం సినిమా గుర్తు వచ్చేలా  చేస్తోందని యువనేత అభిమానులు అంటున్నారు. మరికొంత మంది పవన్ కళ్యాణ్ లా కనిపిస్తున్నారని అంటున్నారు.

దాదాపు అదే సమయంలో విడుదల ఆయిన సినిమా కావడంతో......అప్పటి ట్రెండ్ కేటీఆర్ ఫాలో అయివుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ట్విట్టర్ లో కేటీఆర్ షేర్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోను కేటీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.