Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ సన్‌షైన్ ఆసుపత్రిపై చర్యలకు మంత్రి కేటీఆర్ ఆదేశం

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని సన్‌షైన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ తెలంగాణ మెడికల్ హెల్త్ డైరెక్టర్‌  శ్రీనివాసరావును ఆదేశించారు. 

 

Telangana minister KTR orders take action on sunshine hospital for violating corona treatment lns
Author
Hyderabad, First Published Jun 1, 2021, 3:24 PM IST

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని సన్‌షైన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ తెలంగాణ మెడికల్ హెల్త్ డైరెక్టర్‌  శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ ఆసుపత్రిలో చేరిన రోగి బంధువు మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. కరోనా చికిత్స కోసం చేరిన రోగికి  రోజుకు రూ. 1.20 లక్షల బిల్లు వేస్తున్నారని  ఫిర్యాదు చేశారు.  ఈ ఆసుపత్రిలో 14 రోజులు ఉన్నట్టుగా చెప్పారు.  రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్దంగా  ఫీజులు వసూలు చేయడంపై వైద్య ఆరోగ్యశాఖ సీరియస్ గా ఉంది.

also read:అన్ని భవిష్యత్తులోనే చేస్తారా?..: కరోనాపై తెలంగాణ ప్రభుత్వ నివేదికపై హైకోర్టు ఆగ్రహం

ఇప్పటికే 10 ఆసుపత్రులకు కరోనా ట్రీట్ మెంట్ అనుమతులను రద్దు చేసింది. సుమారు వందకు పైగా ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు పంపింది వైద్య ఆరోగ్యశాఖ. ఈ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వని ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు  తీసుకోనుంది.రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకొందని కూడ కోర్టు ప్రశ్నించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలకు సంబంధించి కొత్త జీవో ఎందుకు జారీ చేయలేదో కూడ చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల నుండి రోగుల కుటుంబాలకు డబ్బులు తిరిగి ఇప్పించారాా అని కూడ హైకోర్టు అడిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios