హైద్రాబాద్‌లో రూ. 450 కోట్లతో ఇందిరాపార్క్-వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి: ప్రారంభించిన కేటీఆర్

హైద్రాబాద్ నగరంలోని స్టీల్ బ్రిడ్జిని  తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ  ప్రారంభించారు.  ట్రాఫిక్ కష్టాలు ఈ బ్రిడ్జి నిర్మాణంతో  తొలగిపోనున్నాయన్నారు.
 

Telangana Minister  KTR Inagurates   Indira Park-VST  Steel Bridge  in Hyderabad lns

హైదరాబాద్: నగరంలో  స్టీల్ బ్రిడ్జిని తెలంగాణ మంత్రి కేటీఆర్  శనివారం నాడు ప్రారంభించారు. ఇందిరాపార్క్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడు మీదుగా  వీఎస్‌టీ వరకు  స్టీల్ బ్రిడ్జిని  నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ బ్రిడ్జిని ఇవాళ  కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి ఫ్లైఓవర్ గా  నామకరణం చేసింది ప్రభుత్వం. రూ. 450 కోట్లతో  ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి పొడవు  2.62 కి.మీ. ఈ బ్రిడ్జి నిర్మాణానికి  12, 500 మెట్రిక్ టన్నుల స్టీల్ ను ఉపయోగించారు. అంతేకాదు 20 వేల  క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వినియోగించారు.ఫ్లైఓవర్ లో  మొత్తం  81 స్టీల్  పిల్లర్లు, 46 పైల్ ఫౌండేషన్స్ ఏర్పాటు చేశారు. నాలుగు వరుసలలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం సాగింది.2020 జూలై 10న ఈ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది.  

 

అయితే  2021 జనవరి మాసంలో పనులు ప్రారంభించారు. ఇవాళ ఈ బ్రిడ్జిని  మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దేశంలోనే తొలిసారిగా  మెట్రో బ్రిడ్జిపై  నిర్మించిన  స్టీల్ బ్రిడ్జి ఇదే. దక్షిణ భారత దేశంలో అత్యంత  పొడవైన స్టీల్ బ్రిడ్జి కూడ  ఇదేనని అధికారులు చెబుతున్నారు. మరో వైపు జీహెచ్ఎంసీ పరిధిలో భూ సేకరణ లేకుండా నిర్మించిన తొలి బ్రిడ్జి కూడ ఇదేనని అధికారులు చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios