ప్రతి మగ్గానికి వచ్చే నెల నుండి రూ.3 వేలు:చేనేత దినోత్సవంలో కేటీఆర్

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని  చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. 

Telangana Minister KTR announces a slew of welfare initiatives for weavers on National Handloom Day lns


హైదరాబాద్: వచ్చే నెల నుండి ప్రతి మగ్గానికి నెలకు రూ.3 వేల చొప్పున ప్రతి కార్మికుడికి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్  చెప్పారు.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని  హైద్రాబాద్ మన్నెగూడలో  సోమవారంనాడు  నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం లో అన్ని రంగాల్లోని కార్మికులను ఆదుకొనేందుకు  చర్యలు తీసుకున్నారన్నారు. చేనేత పై 5 శాతం జీఎస్టీ వేసిన ఘనత మోడిదేనని ఆయన విమర్శించారు.చేనేత కార్మికులు  కేసీఆర్ కు తెలుసునన్నారు.

అందుకే వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నట్టుగా  కేటీఆర్ వివరించారు. రైతులకు రైతు భీమా చేయించిన ఘనత కేసీఆర్ దేనన్నారు. నేత కార్మికులకు కూడ భీమా అందిస్తున్నామని  కేటీఆర్ చెప్పారు. 59  పైబడిన వారికి ప్రభుత్వం  భీమా అందిస్తుందన్నారు.  ప్రైమ్ మగ్గాలు ఎర్పాటు కోసం  40 నుండి రూ. 50కోట్లు అందిస్తామన్నారు. ఒక్కొక్క మగ్గానికి రూ.38000 వేల రూపాయలు ఖర్చు చేయనున్నట్టుగా  కేటీఆర్ వివరించారు. చేనేత కార్మికులు ఐడి కార్డులు అందిస్తామన్నారు. టెస్కో ద్వారా వీవర్స్ కు ఎక్స్ గ్రేషియా పెంచినట్టుగా  కేటీఆర్ గుర్తు చేశారు. నేత కార్మికుల కోసం గృహలక్ష్మి తీసుకురానున్నట్టుగా చెప్పారు. ఉప్పల్ బాగాయత్ లో హ్యాండ్లమ్ మ్యుజియం ఎర్పాటు చేస్తున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ను రూ.12.60 కోట్లతో పునరుద్ధరిస్తున్నట్టుగా కేటీఆర్ తెలిపారు. 

రాబోయే రోజుల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం  చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించనుందని చెప్పారు. కేంద్రం రద్దు చేసిన. కార్యక్రమాలన్నీ కూడా తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. మీకు పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన  కోరారు. చేనేత కార్మికులు అదుకోనేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. చేనేత భీమా ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios