సిరిసిల్ల జిల్లాలో దారుణం

కేటిఆర్ కు అత్యంత సన్నిహితుడు హత్యకు గురయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట్ మండలంలోని కొత్తపల్లి ఎంపిటిసి భర్త వీరబోయిన దేవయ్య హత్యకు గురయ్యాడు.

కొత్తపల్లి గ్రామంలోని హోటల్ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో ఎంపిటిసి భర్త వీరబోయిన దేవయ్య  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.