Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ నేతలది కుక్కబుద్ది: మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు

కాంగ్రెస్ నేతలు కుక్కబుద్ది చూపుతున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Telangana minister Jagadish Reddy serious comments on congress
Author
Hyderabad, First Published Jul 7, 2020, 5:25 PM IST

హైదరాబాద్:కాంగ్రెస్ నేతలు కుక్కబుద్ది చూపుతున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనతో అత్యంత సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ నేతలు మూర్ఖపు వాదనలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన సాగిస్తున్నామన్నారు.

వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి  వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు. రైతు బంధు పధకాన్ని కాంగ్రెస్ నేతలు కలలో కూడ ఊహించలేదన్నారు. 

ఉత్తమ్ గ్యాంగ్ మాటలతో వారి బానిస మనస్తత్వం బయటపడుతోందని ఆయన విమర్శించారు. విద్యుత్ పంపిణీలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్వంగా నిలిచిందన్నారు. 

ప్రగతి భవన్ కడితే కొంత కాలం కాంగ్రెస్ నేతలు అనవసరపు విమర్శలు చేశారన్నారు. ప్రగతి భవన్ నుండే రాష్ట్ర ప్రజలకు అవసరమైన పథకాలకు రూపకల్పన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని ఇచ్చిన హామీ మేరకు  కొత్త సచివాలయం నిర్మిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన చెప్పారు.

మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు పెట్టారని ఆయన విమర్శించారు.  కరోనా కంటే దరిద్రంగా కాంగ్రెస్ నేతలు తయారయ్యారన్నారు. ఏ రాష్ట్రంలో ఇంత దరిద్రమైనా ప్రతిపక్షం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మంచిదని ఆయన సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios