Minister Harish Rao: మహిళా సంఘాలకు రుణాలు అందించ‌డంతో పాటు ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను మంత్రి హ‌రీశ్ రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సంగారెడ్డిలో జరిగిన సభలో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని తెలిపారు. 

Telangana: తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హరీశ్‌రావు మంగళవారం నాడు సంగారెడ్డిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, ప‌లు మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌దని తెలిపారు. సంగారెడ్డి సమగ్ర అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశామన్నారు. అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలని కలెక్టర్‌ను ఆదేశించాను. ఈ రోజు సంగారెడ్డికి ఎంతో మంచిరోజని పేర్కొంటూ.. జిల్లాలోని రోడ్డు, మురికి కాల్వ‌లు స‌హా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ఇప్పుడే శంకుస్థాప‌న‌లు చేసుకున్నామ‌ని తెలిపారు. ఈ 50 కోట్ల రూపాల‌తో సంగారెడ్డిలో వ‌ర్షంప‌డితే రోడ్ల‌పై నీళ్లు నిలుస్తున్న స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని తెలిపారు. 

‘‘జిల్లాలోని (సంగారెడ్డి) ప్రతి ఇంటికి నీటి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మెడికల్ కాలేజీకి ముఖ్యమంత్రి రూ.500 కోట్లు మంజూరు చేశార‌న్నారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారులను వైద్యశాలకు పంపించాలని ప్రజలను కోరారు. వైద్య సంస్థలో మహిళలందరికీ సరైన చికిత్స అందుబాటులో ఉంచబడుతుంది” అని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. “మేము ఇటీవల 15 వార్డుల బస్తీ దవాఖానాతో పాటు ఇతర సౌకర్యాలతో సరసమైన ధరలకు డయాలసిస్ సెంటర్ ను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చాము. ప్రభుత్వం 100 మంది వైద్యులతో టి డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది” అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ వైద్య సదుపాయాలను ఉప‌యోగించుకోవాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల సేవ‌ల‌ను ఉప‌యోగించుకుని ప్ర‌యివేటు సౌకర్యాలకు ఖర్చు చేసే డబ్బును ఆదా చేయాలని ఆరోగ్య మంత్రి హ‌రీశ్ రావు ప్రజలను కోరారు. 

అలాగే, 4 కోట్ల రూపాయ‌లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రజలకు తాజా ఆహారాన్ని అందజేస్తుందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అందిస్తున్న పింఛన్లను తెలంగాణతో పోల్చి ప్ర‌భుత్వ మెరుగైన ప్ర‌జా సంక్షేమ పాల‌న‌ను వివ‌రించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 40 లక్షల మందికి రూ.2,500 పింఛను అందజేస్తోందని తెలిపారు. బీజేపీకి బూటకపు వాగ్దానాలు మాత్రమే ఉన్నాయని, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి అనేక రకాల సంక్షేమ పథకాలు తాము అందిస్తున్నామని వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తోందని మంత్రి హ‌రీశ్ రావు స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల సంభ‌వించిన వ‌ర‌ద‌ల గురించి మాట్లాడుతూ “మేము వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాము. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందజేస్తూ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసాము. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల కష్టాలను చూస్తున్నాయి త‌ప్ప చేసేదేమి లేద‌న్నారు. వారు మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 

Scroll to load tweet…

అలాగే, డబుల్ ఇంజిన్.. డబుల్ ఇంజిన్ అంటున్నరు కదా.. ఢిల్లీలో (కేంద్రం) లో బీజేపీ, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ..అక్కడ ఇచ్చే పింఛన్ రూ.500. పక్కనే కర్నాటక.. బీదర్ పోతే అక్కడ ఎంత ఇప్తున్నారో అడగండి.. అక్కడ ఇచ్చేది 600 రూపాయల ఫించన్ అంటూ బీజేపీ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.