Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌ది తప్పుడు ప్రచారం.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం : లోక్‌పోల్ సర్వేపై హరీశ్‌రావు స్పందన

త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని లోక్‌పోల్ సర్వే అంచనా వేసింది. దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు. 

telangana minister harish rao reacts on lok poll survey ksp
Author
First Published Oct 6, 2023, 3:16 PM IST

తెలంగాణ రాజకీయాల్లో లోక్‌పోల్ సర్వే కలకలం రేపింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే అంచనా వేసింది. దీనిపై బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు స్పందించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఫేక్ సర్వేలు చేస్తోందని, మాకే ఎక్కువ సీట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో కళ్యాణ లక్ష్మీ వుందా..? రైతుబంధు వుందా.. 24 గంటల కరెంట్ వుందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. 3 గంటల కరెంట్ ఎలా సరిపోతుందో రేవంత్ రెడ్డి చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఇచ్చే అవార్డులన్నీ తెలంగాణకే వస్తున్నాయని.. కానీ గల్లీకి వచ్చి తిడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో మొన్నటిదాకా దరఖాస్తులను కూడా అమ్ముకున్నారని.. ఇప్పుడు సీట్లు అమ్ముకుంటున్నారని హరీశ్ ఆరోపించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు. 

ఇంతకీ ఆ సర్వే ఏం చెప్పిందంటే ? 

లోక్ పోల్ అనే సంస్థ ఈ సర్వేను చేపట్టింది. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. తాజాగా ఆ అభిప్రాయాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఆయా పార్టీలకు వచ్చే ఓటు షేర్ ఎంత అనే వివరాలను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 67 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే తెలిపింది. అలాగే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని తేల్చి చెప్పింది.

అయితే ఈ సర్వే బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుంది పేర్కొంది. ఆ పార్టీ 45 నుంచి 51 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని చెప్పింది. అయితే బీజేపీ చివరి స్థానంలో నిలుస్తుందని ఆ సర్వే అంచనా వేసింది. ఆ పార్టీకి 2-3 సీట్లలో మాత్రమే గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎం ఎప్పటిలాగే మూడో స్థానంలో నిలిచి, 6 నుంచి 8 సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు. అయితే ఇతరులకు కేవలం 0-1 స్థానాల్లోనే విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. 

ALso Read: లోక్ పోల్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ జోరు.. రెండో స్థానంలో బీఆర్ఎస్, వెనకబడ్డ బీజేపీ..

ఓట్ షేర్ పరంగా చూస్తే.. కాంగ్రెస్ 41-44 శాతం సాధించి మొదటి స్థానంలో నిలుస్తుందని లోక్ పోల్ సర్వే తెలిపింది. అలాగే అధికార బీఆర్ఎస్ కు కొంత తగ్గుతుందని, ఆ పార్టీ 39-42 శాతం ఓట్లు మాత్రమే పొందుతుందని చెప్పింది. అలాగే ఎంఐఎం 3 నుంచి 4 శాతం ఓట్లతోనే సరిపెట్టుకుందని తేల్చి చెప్పింది. ఇతరులు కూడా 3 నుంచి 5 శాతం పొందుతారని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios