బడ్జెట్ ప్రతులను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి హరీష్ రావు అందించారు. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కు కూడా బడ్జెట్ ప్రతులను అందించి హరీష్ రావు ఆశీర్వాదం తీసుకొన్నారు.
హైదరాబాద్: Telangana అసెంబ్లీ స్పీకర్ Pocharam Srinivas Reddy కి ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao బడ్జెట్ ప్రతులను అందించారు.
సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి హరీష్ రావు ఆర్ధిక శాఖ అధికారులతో కలిసి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి Budget ప్రతులను అందించారు.
తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రిగా హరీష్ రావు వరుసగా మూడో సారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. గతంలో రెండు దఫాలు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
Telangana Assembly Budget Session ప్రారంభమైన రోజునే బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. శాసనమండలిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయాన్ని ఖరారు చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిసారిగా Governor ప్రసంగం లేకుండానే ప్రారంభం కానున్నాయి. గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు కొనసాగుతున్నందున ఈ దఫా గవర్నర్ ప్రసంగం అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గత సమావేశాల తర్వాత అసెంబ్లో ప్రోరోగ్ కాలేదని కూడా ప్రభుత్వం గుర్తు చేసింది. అసెంబ్లీ ప్రోరోగ్ కానందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది.
అయితే తొలుత తమకు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని, ఆ తర్వాత పొరపాటున ఈ సమాచారం పంపారని గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.
కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొన్న హరీష్ రావు
అసెంబ్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం KCR ఆశీర్వాదం తీసుకొన్నారు మంత్రి హరీష్ రావు. బడ్జెట్ ప్రతులను సీఎం కేసీఆర్ కు అందించారు మంత్రి. ఆ తర్వాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొన్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
