Telangana: తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య వార్ రాజకీయ హీటును పెంచుతోంది. బండి సంజయ్ అరెస్ట్ తర్వాత ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు.. భయమంటే ఎంటో చూపించేవాళ్లం అంటూ మంత్రి గంగుల కమలాకర్ వార్నింగ్ ఇచ్చారు.
Telangana: తెలంగాణలో ప్రతిపక్ష బీజేపీ, అధికార పార్టీ టీఆర్ఎస్ నేతల (TRS vs BJP) మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ధాన్యం కోనుగోలు అంశం తెరమీదకు వచ్చినప్పటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య పోలిటికల్ వార్ మరింతగా పెరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ.. రాష్ట్ర బీజేపీ చీఫ్ దీక్ష.. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల అనంతరం బండి సంజయ్ అరెస్ట్ కావడంతో ఇరు పార్టీల మధ్య పొలిటికల్ వైరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ (CM Shivraj Singh Chouhan) కు భయం అంటే ఎంటో చూపించేవాళ్లం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టు తర్వాత బీజేపీ అగ్ర నాయకుల్లో ఒక్కొక్కరు వరుసగా రాష్ట్రాన్ని వస్తూ.. అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హైదరాబాద్ బీజేపీ సభలో ప్రశంగిస్తూ.. సీఎం కేసీఆర్ దమమున్నోడు అనుకున్నాను.. కానీ, ఇంతభయస్తుడు అనుకోలేదంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ను జైల్లో పెట్టారంటేనే కేసీఆర్ ఎంతగా భయపడ్డారో అర్ధం అవుతుందన్నారు. కేసీఆర్ అన్యాయ పాలనకు చరమగీతం పాడుతామంటూ హెచ్చరించారు. CM Shivraj Singh Chouhan వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాడు మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ.. అదే స్థాయిలో చౌహాన్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు.
సీఎం కేసీఆర్ ఒక్క మాట అంటే భయం అంటే ఏంటో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు చూపించే వాళ్లమని మంత్రి గంగుల కమలాకర్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ తలుచుకుంటే చౌహన్ ప్లైట్ దిగే వాడివా? తెలంగాణ అతిథివి కాబట్టే సేఫ్ గా తిరిగి వెళ్లావ్ అంటూ Minister Gangula Kamalakar ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై నిన్న వచ్చిన సీఎంగాని... ఇవాళ వచ్చిన సీఎంగాని... ఎవరుగాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీకి పంజాబ్‌లో తగిలిన నిరసన కంటే ఎక్కువ నిరసన సెగ చూడాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ (BJP) కలలోకి కేసీఆర్ వచ్చాడు కాబట్టే- వరుసగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ కు క్యూ కట్టారు.. భయం మీకా- కేసీఆర్ కా? దీన్ని బట్టే తెలుస్తోందని గంగుల కమలాకర్ అన్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. శివరాజ్ సింగ్ చౌహన్ కు పాలన సరిగ్గా లేక మధ్యప్రదేశ్ ప్రజలు హైదరాబాద్ కు వలస వస్తున్నారని Minister Gangula Kamalakar ఆరోపించారు. మళ్ళీ తెలంగాణకు చౌహన్ వస్తే వలస కార్మికులే ఆయన్ను అడ్డుకుంటారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. శివరాజ్ సింగ్ చౌహన్ పరిపాలన సక్కగ ఉంటే మధ్యప్రదేశ్ లో పండిన పంట ఎంత చెప్పాలంటూ నిలదీశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అంటే భిమారి రాష్ట్రం అంటారు.. దీనికి BJP నే కారణం అని ఆరోపించారు. పరిపాలనలో అట్టర్ ఫెల్యూర్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అంటూ విమర్శించారు మంత్రి గంగుల.
