గ్రానైట్ సంస్థల్లో సోదాలపై వాస్తవాలు బయట పెట్టాలి: మంత్రి గంగుల కమలాకర్
గ్రానైట్ సంస్థల్లో జరిపిన సోదాలకు సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాలని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
కరీంనగర్: గ్రానైట్ సంస్థల్లో జరిపిన సోదాలకు సంబంధించి నిజనిజాలను తేల్చాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు.,గురువారంనాడు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజులపాటు హైద్రాబాద్, కరీంనగర్ లలో మంత్రిగంగుల కమలాకర్,టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి కి చెందిన గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో ఈడీ,ఐటీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందేతనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.విచారణ కోసం హైద్రాబాద్ కు రావాలని దర్యాప్తు సంస్థలు ఆదేశించలేదన్నారు.బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన చెప్పారు.
రెండు రోజులుగా తెలంగాణలో గ్రానైట్ సంస్థలపై ఈడీ,ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న ఉదయం ప్రారంభమైన సోదాలు ఇవాళ మధ్యాహ్నానికి పూర్తయ్యాయి.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గ్రానైట్ ఎగుమతుల సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని పిర్యాదులు అందాయి.ఈ ఫిర్యాదుల ఆధారంగా గతంలోనే సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై విచారణ నిర్వహించారు.