ఆత్మగౌరవాన్ని ఈటల  రాజేందర్ ఢిల్లీలో తాకట్టుపెట్టారని  తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.  

కరీంనగర్:ఆత్మగౌరవాన్ని ఈటల రాజేందర్ ఢిల్లీలో తాకట్టుపెట్టారని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బుధవారం నాడు ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ అభివృద్ది జరగలేదన్నారు. రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయన్నారు. ఇవాళ్టి నుండి ఎన్నికలయ్యేవరకు హుజూరాబాద్‌లోనే ఉంటానన్నారు. హుజూరాబాద్ ఇవాళ గుడ్డి దీపంలా మారిందన్నారు. ఈ నియోజకవర్గాన్ని 
 అభివృద్ది చేసి చూపెడుతామని ఆయన స్పష్టం హామీ ఇచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గత వారంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న బీజేపీలో చేరారు. అంతకుముందే ఆయన హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో ఆరు మాసాల్లోపుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇప్పటి నుండే క్షేత్రస్థాయి నుండి ప్లాన్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. మరో వైపు ఈటల రాజేందర్ కూడ తన పట్టును నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు.