పర్వతగిరి లోని తన నివాసానికి ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టి తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలువురికి ఆదర్శంగా నిలిచారు. శనివారం పర్వతగిరిలో భార్య ఉషా దయాకర్‌తో కలిసి ఎర్రబెల్లి తన ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను, నల్లా పన్ను రూ. 5,220 కట్టారు.

ఇందుకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి రశీదు తీసుకున్నారు. తద్వారా రాష్ట్రానికి మంత్రి అయినా, తన ఊరు లో మాత్రం సామాన్యుడినేనని నిరూపించారు. పన్నులు చెల్లించి, పల్లెల ప్రగతికి పాటుపడాలని ఎర్రబెల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. సగటు పౌరులు పన్నులు కట్టి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.