Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వరుసగా ఉష్ణగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోనున్నాయనీ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Telangana: తెలంగాణలో వరుసగా రెండో రోజు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. ఆదిలాబాద్‌లోని బజార్‌హత్‌నూర్‌లో గత 24 గంటల్లో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోనున్నాయనీ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్‌లోని అర్లితోపాటు రాష్ట్రంలోని మరో నాలుగు చోట్ల ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకున్నాయి. కుమురం భీమ్‌లోని కెరమెరిలో 7.6 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లోని బేలలో 7.9 డిగ్రీల సెల్సియస్, కొమరం భీమ్‌లోని వాంకిడిలో 7.9 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లోని సోనాలలో 7.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అర్లీలో 8.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు
Telangana State Development Planning Society (TSDPS) ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రాంతంలో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో అత్యల్ప ఉష్ణోగ్రత 11.8 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత సంగారెడ్డిలో 12.1 డిగ్రీల సెల్సియస్, బండ్లగూడలో12.5 డిగ్రీల సెల్సియస్, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ వెదర్‌మ్యాన్‌గా పిలవబడే టి.బాలాజీ ట్విట్టర్‌లో.. “చలి వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరాది నుంచి చలి గాలులు వీస్తుండటంతో ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టగా, పలు చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌గా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా, రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 11.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది" అంటూ పేర్కొన్నాడు.
భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం..
ఐదు రోజుల వాతావరణ అంచనాల ప్రకారం.. ఫిబ్రవరి 13, 14 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 5 నుండి 11 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)-హైదరాబాద్ అంచనా వేసింది. అంచనాలకు అనుగుణంగానే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మరో మూడు రోజులు ఉష్ణోగ్రతలు పలు చోట్ల పడిపోనున్నాయి. రాష్ట్రంలోని మరో స్వతంత్ర వాతావరణ పరిశీలకుడు రజనీకాంత్ పూల్లా.. ఫిబ్రవరి 13, 14 తేదీ రాత్రులలో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలను చూపించే మ్యాప్‌ను పంచుకున్నారు. ఉత్తర తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 9-10 డిగ్రీల సెల్సియస్‌తో చలిగాలులను ఎదుర్కొనే అవకాశం ఉందనీ, మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు 10-11 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని ఆయన ట్వీట్ చేశారు.
