Asianet News TeluguAsianet News Telugu

దందాలకు కెటిఆర్ మామను వాడుకున్న ఘనుడు

దందాలు చేసి అక్రమ సంపాదన కోసం ఓ వ్యక్తి తెలంగాణ సిఎం కెసిఆర్ వియ్యంకుడు, కెటిఆర్ మామను వాడుకున్నాడు. జనాలకు పైరవీలు చేసి పెడతానని నమ్మబలికాడు. లక్షల సొమ్ము జేబులో వేసుకుని జల్సాలు చేశాడు. తుదకు పోలీసులకు పోలీసులకు చిక్కి చిప్ప కూడు తింటున్నాడు.

telangana man cheats people using KTRs father in laws name

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని చందారం లో కొమిరెడ్డి మల్లారెడ్డి అనే వ్యక్తి మంత్రి కెటిఆర్ మామ హరనాథరావు తనకు బాగా క్లోజ్ అని జనాలను నమ్మించాడు. ఏ పనికావాలన్నా పైసలియ్యిరి పని చేయించుకోరి అని ప్రచారం చేసుకున్నాడు. ఊర్లో జనాలకు ఏ పనిచేయాలన్న చేసి పెడతానని చెప్పుకున్నాడు. కెటిఆర్ మామ నిజంగానే తనకు తెలుసు అని జనాలను నమ్మించేందుకు ఊర్లో పాఠశాల ప్రహారీగోడ శంకుస్థాపన కార్యక్రమానికి హరినాథరావును పిలిపించాడు.

 

దీంతో మల్లారెడ్డికి బాగానే పలుకుబడి ఉందని, ఆయన ద్వారా మన పనులు చేసుకోవచ్చని ఆశించారు జనాలు. ఆశలు ఉన్నవారు, ఆపద ఉన్నవారంతా తమ పనులు చేసిపెట్టు అని తలా రెండు, మూడు లక్షల చొప్పున ఆ మల్లారెడ్డికి ముట్టచెప్పారు. కొందరు ఉద్యోగం ఇప్పించాలంటూ డబ్బులిచ్చారు. మరికొందరు కాంట్రాక్టులు ఇప్పించాలంటూ సొమ్ములు ముట్టచెప్పారు. ఇంకొందరు ట్రాన్సఫర్ల కోసం డబ్బులు అందించారు. అలా అందరి వద్ద నుంచి సుమారు 90 లక్షల వరకు కలెక్ట్ చేశాడు మల్లారెడ్డి. సొంత గ్రామంతో పాటు జగిత్యాల జిల్లాలోనూ కొందరి వద్ద ఇలాగే చెప్పుకుంటూ వసూళ్ల పర్వానికి దిగిండు మల్లారెడ్డి.

 

ఇక తమ పనులు జరిగిపోతాయని జనాలు హ్యాప్పీగా ఫీల్ అయ్యారు. కానీ ఎన్నిరోజులైనా పనులు జరగకపోవడంతో మల్లారెడ్డిని నిలదీశారు. ఏమైంది  పని కాకపాయే అని దీంతో ఇంకా టైం పడుతుందని మల్లారెడ్డి వారికి చెప్పిండు. కానీ వారికి అనుమానం రావడంతో పని కాకపోయినా ఫర్వాలేదు మా డబ్బులు మాకియ్య అని గట్టిగా అడిగిర్రు. దీంతో నన్నే డబ్బులడుగతరా? నా గురించి ఏమనుకుంటున్నరు? ఒక్క పైసా ఇయ్య ఏం చేసుకుంటరో చేసుకోరి అని వాళ్లను బెదిరించిండు.

 

బెదిరించుడు కూడా మామూలుగా కాదు. ఒక తుపాకీ చూపించి ఎవరైనా పైసలడిగితే శాల్తీలు లేస్తయి అని హెచ్చరించిండు. తన చుట్టూ కొందరు బౌన్సర్లను తిప్పుకుంటూ వాళ్లతోనూ  బెదిరింపుకు గురిచేసిండు. మల్లారెడ్డి బెదిరింపులతో భయపడిపోయిన బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మల్లారెడ్డిని, ఆయన చుట్టుముట్టు తిరిగేటోళ్లను మొత్తం 15 మందిని అరెస్టు చేసి జైలుకు పంపిర్రు.

 

మల్లారెడ్డి సరే కానీ మరి కెటిఆర్ మామ  ఎందుకొచ్చినట్లు? అని జనాలు గుసగుసలాడుతున్నరు. కెటిఆర్ మామను ఏం మాయ చేసి మల్లారెడ్డి తమ ఊరికి తీసుకొచ్చిండోనని అంటున్నారు. అయితే అసలు ట్విస్టు ఏంటంటే కెటిఆర్ మామకు కెటిఆర్ కు మధ్య మంచి రిలేషన్ లేదని  టిఆర్ఎస్ శ్రేణుల్లో వినిపిస్తున్నమాట. కెటిఆర్ మామ మొత్తానికి ఇటు కేటిఆర్ కు అటు వియ్యంకుడు కెసిఆర్ కు లేని తలనొప్పులు తెచ్చిపెడుతుండని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios