కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.  

తెలంగాణ విమోచన వేడుకలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగరవేశారు. భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండ్.. తదితరులు పాల్గొన్నారు.