వాజ్‌పేయ్ ఏనాడైనా ప్రధానమంత్రి అవుతారని అప్పటి ప్రధానమంత్రి నెహ్రు ఊహించాడని తెలంగాణ సీఎం కేసీఆర్  గుర్తు చేశారు.

హైదరాబాద్: వాజ్‌పేయ్ ఏనాడైనా ప్రధానమంత్రి అవుతారని అప్పటి ప్రధానమంత్రి నెహ్రు ఊహించాడని తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.తెలంగాణ శాసనమండలి సమావేశాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. అపద్ధర్మ సీఎం హోదాలో సీఎం కేసీఆర్ శాసనమండలి సమావేశంలో పాల్గొన్నారు. శాసనమండలిలో వాజ్‌పేయ్‌ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన వ్యక్తి వాజ్‌పేయ్ అని ఆయన గుర్తు చేశారు.వాజ్‌పేయ్ విలక్షణమైన వ్యక్తిత్వం కలవాడన్నారు. విపక్షంలో ఉన్నా కూడ వాజ్‌పేయ్ తన ప్రతిష్టను ఏనాడూ కూడ కోల్పోలేదన్నారు. 

బతికుండగానే వాజ్‌పేయ్ భారతరత్నపొందారని కేసీఆర్ గుర్తు చేశారు. దేశ చరిత్రలో చిరస్థాయిగానిలిచిపోయే వ్యక్తిత్వం వాజ్‌పేయ్‌కు ఉందన్నారు. 

ఇతరుల ఔన్నత్యాన్ని కూడ పొగిడిన చరిత్ర కూడ వాజ్‌పేయ్‌కు ఉందన్నారు. ఆనాడు సభలోనే ఇందిరాగాంధీని కాళీమాతగా ప్రశంసించిన మాటలను వాజ్‌పేయ్‌ గుర్తు చేశారు. 

వాజ్‌పేయ్ ఏనాడైనా ప్రధానమంత్రి అవుతాడని నెహ్రు గుర్తు చేశారు. అయితే తొలిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికైన సమయంలో విశ్వాస పరీక్ష సందర్భంగా చేసిన ప్రసంగం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైద్రాబాద్‌తో వాజ్‌పేయ్‌‌కు మంచి అనుబంధం ఉన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఎకరం స్థలంలో వాజ్‌పేయ్ కోసం మోమోరియల్‌ను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.