Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Session: 8 రోజులు.. 45 గంటలు.. 3 బిల్లులు..  2 తీర్మానాలు..

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.ఈ సమావేశంలో రెండు తీర్మానాలు, మూడు బిల్లులకు ఆమోదం లభించింది. సమావేశాల్లో 59 మంది సభ్యులు పాల్గొన్నారు.    

Telangana Legislative Assembly adjourned sine die KRJ
Author
First Published Feb 18, 2024, 8:10 AM IST | Last Updated Feb 18, 2024, 8:10 AM IST

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఫిబ్రవరి 8వ తేదీన గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 17వ తేదీన వరకు జరిగాయి.  ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఆద్యంతం ఆసక్తికరంగా, వాడివేడి చర్చలు జరిగాయి. హాట్ హట్ గా  కొనసాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు శనివారంతో నిరవాధిక వాయిదా పడ్డాయి. చివరి రోజు శనివారం సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల, దానిపై హట్ హట్ గా చర్చ కొనసాగింది. అనంతరం శనివారం  రాత్రి 8.20 గంటల సమయంలో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 

ఈనెల 8న ప్రారంభమైన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సమావేశాలు… మొత్తం ఎనిమిది రోజులపాటు వాడీవేడిగా సాగాయి. తొలి రోజు( 8 న) ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 9న చర్చకు వచ్చింది. మూడో రోజు (10న) రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రతిపాదించింది. మరుసటి రోజైన ఆదివారం అసెంబ్లీకి సెలవు కాగా.. సోమవారం అసెంబ్లీ సమావేశాలు పున:ప్రారంభయ్యాయి. 

ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదన, కేఆర్ఎమ్బీకి ప్రాజెక్టులను అప్పగించబోమంటూ తీర్మానం, కుల గణనపై తీర్మానం, సాగునీటి రంగంపై శ్వేతపత్రం వంటి పలు అంశాలు హైలెట్ గా నిలిచాయి. పలు సందర్భాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు కొనసాగాయి. మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ తరుపున కేటీఆర్, టీ.  హరీశ్ రావు, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు రేవంత్ సర్కార్ పై విమర్శలతో దాడి చేశారు. అధికార కాంగ్రెస్ తరుఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగారు.
 
మొత్తం మీద 8 రోజుల పాటు సాగిన శాసనసభ సమావేశాల్లో 59 మంది ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై ప్రసంగించారు. దాదాపు 45 గంటలపాటు సభ కార్యకలాపాలు కొనసాగాయి. కేఆర్ఎమ్ బీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించబోమనీ, కులగణనపై మరో తీర్మానం చేయబడింది. వాటికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశాల్లో మరో  3 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios