Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: పెరిగిన భూముల విలువ.. ఎల్లుండి నుంచి కొత్త ధరలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కిటకిట

తెలంగాణలో భూముల విలువ పెరిగింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఒక్కరోజే వ్యవధి వుండటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనాలు పోటెత్తారు. 
 

telangana land registration rates increase ksp
Author
Hyderabad, First Published Jul 20, 2021, 5:53 PM IST

తెలంగాణలో భూముల విలువ పెరిగింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఒక్కరోజే వ్యవధి వుండటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనాలు పోటెత్తారు. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 నుంచి 7.5 శాతం పెంచింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నా, పెరిగిన ధర చెల్లించాల్సిందేనని సర్కార్ ఆదేశాల్లో పేర్కొంది. వ్యవసాయ భూముల విలువ 50 శాతం పెంచింది. అలాగే వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరాకు రూ.75 వేలుగా నిర్ణయించారు. ఓపెన్ ఫ్లాట్ల కనిష్ట విలువ చదరపు గజానికి రూ.200కు పెంచారు. అపార్ట్‌మెంట్లలో కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ. వెయ్యి చొప్పున పెంచింది. మొత్తం మీద 2013 తర్వాత తొలిసారి భూముల ధరలు పెంచింది తెలంగాణ సర్కార్. 


కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భూములు, ఆస్తుల విలువ భారీగా పెరిగింది. ఏపీలో 11 శాతం, తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతంగా రిజిస్ట్రేషన్ విలువ వుంది. గడిచిన ఎనిమిదేళ్లుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్ విలువలు పెరగలేదు. ఇందుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ త్వరలోనే కేసీఆర్‌కు నివేదిక అందజేయనుంది. 

రిజిస్ట్రేషన్ రేట్లు పెంచడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది రూ.3,400 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ఆమోదం తర్వాత ఈ ఏడాది ఆగష్టు 1 నుంచే అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి.

Also Read:పరువు నష్టం దావా వేస్తాం: కోకాపేట భూముల వేలంపై రేవంత్‌కి సర్కార్ కౌంటర్

ఇక రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియ శాస్త్రీయ పద్దతిలో నిర్దారించే దిశలో కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రిజిస్ట్రేషన్‌ లావాదేవీల సగటును తీసుకుని లెక్కలు కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా జాతీయ, రాష్ట్ర, అంతర్‌ జిల్లా రహదారులు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలను బట్టి విలువలను నిర్ధారించినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios