కోకాపేట, ఖానామెట్ భూముల వేలం పారదర్శకంగానే సాగిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వే్స్తామని కేసీఆర్ సర్కార్ తెలిపింది.ఈ విషయమై ఇవాళ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్: కోకాపేట,ఖానామెట్ భూముల వేలం విషయంలో తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు వివరణ ఇచ్చింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది.
హైద్రాబాద్ నగరాభివృద్ది కోసమే కోకాపేట, ఖానామెట్ భూములను విక్రయించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ భూముల వేలంపై ఆరోపణలు నిరాధారమైనవనిగా ప్రకటించింది.భూముల వేలం పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం తెలిపింది.ఆన్ లైన్ లో వేలం పాటకు 8 నిమిషాల సమయం ఇచ్చినట్టుగా ప్రభుత్వం వివరించింది. 8 నిమిషాల తర్వాత బిడ్ కు ఎవరూ ఆసక్తి చూపకపోతే బిడ్ ఖరారు చేశామన్నారు.
also read:రామేశ్వరరావు సంస్థలకు కారు చౌకగా భూములు: కోకాపేట భూముల వేలంపై రేవంత్ రెడ్డి సంచలనం
భూముల వేలానికి స్విస్ ఛాలెంజ్ పద్దతి సరికాదన్నారు. ఈ పద్దతి కొందరినే పోటీకి పరిమితం చేస్తోందన్నారు. ఈ వేలం గురించి నెల రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. పోటీని నివారించామని, రెవిన్యూను తగ్గించారనే ఆరోపణలు నిరాధారమని ప్రభుత్వం తెలిపింది. కొన్ని సంస్థలకే మేలు చేశారనే ఆరోపణలు కూడ సరైనవి కావని ప్రభుత్వం తేల్చి చెప్పింది.కోకాపేట భూముల వేలంపై వేల కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీప్ రేవంత్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆరోపణల తర్వాత ప్రభుత్వం ఈ విషయమై స్పందించింది.
