Kishan Reddy slams Owaisi: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)కి గానీ, ప్ర‌భుత్వాన్ని గానీ ఎంఐఎం నుంచి ఎలాంటి స‌ర్టిఫికేట్ అస‌వ‌రంలేద‌ని బీజేపీ నాయ‌కుడు, కేంద్ర మంత్రి జీ.కిష‌న్ రెడ్డి అన్నారు.  

Telangana: ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ ఒవైసీపై భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కులు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)కి గానీ, ప్ర‌భుత్వాన్ని గానీ ఎంఐఎం నుంచి ఎలాంటి స‌ర్టిఫికేట్ అస‌వ‌రంలేదంటూ మండిప‌డ్డారు. మ‌హారాష్ట్రలో ఓ ర్యాలీ సంద‌ర్భంగా ఒవైసీ (Asaduddin Owaisi) చేసిన వ్యాఖ్య‌ల‌కు కిష‌న్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. “ఒవైసీ నాయకత్వంలో అనేక మంది హిందువులు తమ నివాసాలను విడిచిపెట్టవలసి వచ్చింది. మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల గూండాయిజం కారణంగా చాలా మంది దళితులు కూడా ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. మజ్లిస్ పార్టీ సర్టిఫికేట్ మాకు లేదా మా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం లేదు”అని కిష‌న్ రెడ్డి అన్నారు. 

అంత‌కుముందు హైద‌రాబాద్ లోని బీజేపీ కార్యాల‌యంలో కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..దేశంలో అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు. ఒక్క రూపాయి కూడా దర్వినియోగం కాకుండా కేంద్రం పాలన సాగిస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి 58 శాతం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశంలో మౌళిక వసతులు, రక్షణ అవసరాలకు వినియోగిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి వివరించారు. ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదని తేల్చి చెప్పారు. దేశంలో ఎయిర్ పోర్టులు, జల మార్గాలు, రైల్వేలు, రోడ్ల నిర్మానం చేపట్టినట్టుా కిసన్ రెడ్డి తెలిపారు. Petrol, డీజీల్ ధరలపై పన్నులను కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు తగ్గించిందని ఆయన చెప్పారు. దీంతో రూ. 2 లక్షల 20 వేల కోట్లు కేంద్రం ఆదాయం కోల్పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.భారతదేశం తలుచుకొంటే ఏమైనా చేస్తుందని నిరూపించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రక్షణ రంగంలో కూడా దేశీయ ఉత్పత్తులను పెంచుకొన్నట్టుగా చెప్పారు.

మహారాష్ట్రలోని భివాండీలో జరిగిన ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మాట్లాడుతూ, “భారతదేశం నాది కాదు, థాక్రేది కాదు, మోడీ-షాలది కాదు. భారతదేశం ఎవరికైనా చెందితే, అది ద్రావిడులు మరియు ఆదివాసీలు.. అలాగే, మొఘలుల తర్వాత మాత్రమే BJP-RSSలు.. ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుండి ప్రజలు వలస వచ్చిన తర్వాత భారతదేశం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే కిష‌న్ రెడ్డి స్పందిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. నేడు దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి ఎవరూ మాట్లాడడం లేదని, ఈ సమస్యలకు కూడా మొఘలులే కారణమా? ఔరంగజేబు భారతదేశంలో నిరుద్యోగాన్ని పెంచారా? అని (Asaduddin Owaisi) ప్రశ్నించారు. 

నేడు ముస్లింలకు బీజేపీ భయ‌ప‌డుతోంద‌ని, బీజేపీ-సంఘ్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇదే కొనసాగితే.. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు. కాశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగి హత్యకు బాధ్యులెవరు? అని నిలదీశారు. జ్ఞాన్‌వాపి మసీదు, తాజ్‌మహల్, కుతుబ్‌మినార్‌లపై జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కలిసి ముస్లింల చిహ్నాలను చెరిపివేయాలనుకుంటున్నాయని, టోపీ, మసీదు దేశానికి ప్రమాదమా.. అని ప్రశ్నించారు.