తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్నాటుచేసిన పంచాయితీల్లో సుపరిపాలన అందించేందుకు భారీ సంఖ్యలో జూనియర్ పంచాయతి కార్యదర్శి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయితీకి ఓ కార్యదర్శిని ఉండాలనే ఉద్దేశ్యంతో టీఎస్‌పిఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్) ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు ప్రక్రియను ముగించి అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడానికి టీఎస్‌పిఎస్సి సిద్దమైంది.

తెలంగాణ ప్రభుత్వం కొన్ని గ్రామాలతో పాటు తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేయడంతో రాష్ట్రంలోని పంచాయితీల సంఖ్య 12,751కి చేరింది. వీటిలో పరిపాలన సజావుగా జరగాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో వెంటవెంటనే ఆర్థిక శాఖ అనుమతి, నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియలు ముగిసాయి.
డిగ్రీ విద్యార్హతతో చేపడుతున్న ఈ పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 9,355 పోస్టులకు 5,69,447 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలు అధికంగా వున్నా పోటీ కూడా అదే స్థాయిలో ఉంది.
ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 10 న అంటే రేపు రాత పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై ఆయా జిల్లాల కలెక్టర్లకు టీఎస్‌పిఎస్సీతో పాటు సీఎస్ సూచనలు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటల నుండి పరీక్ష ప్రారంభం అవుతుందని...అందువల్ల ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రెండు విడతల్లో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం పేపర్-1 మద్యాహ్నం పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని టీఎస్‌పిఎస్సీ ప్రకటించింది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.