తెలంగాణలో త్వరలో జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు రాష్ట్రంలో బతుకమ్మ వేడుకల్ని నిర్వహిస్తామని, ఇందులో జాగృతి తన వంతు పాత్ర పోషిస్తుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, యూరప్, ఖతార్, ఒమన్, యూఏఈలతో పాటు మధ్య ఆసియాలో బతుకమ్మ వేడుకల్ని నిర్వహిస్తామన్నారు.