Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో సర్కార్ పై తెలంగాణ జెఎసి ఆగ్రహం

  • ఏపూరి సోమన్నకు సంకెళ్లేయడం దారుణం
  • పోలీసులు రాజకీయ వత్తిళ్లకు లొొంగిపోయారు
  • ఖాళీగా ఉన్న 2లక్షల పోస్టులు భర్తీ చేయాలి
  • అక్టోబరులో ఉద్యోగాల కోసం హైదరాబాద్ లో బహిరంగసభ
telangana jac fire on government about somanna issue

తెలంగాణ కవి, గాయకుడు ఏపూరి సోమన్నకు సంకెళ్లు వేసి బంధించడం పట్ల తెలంగాణ జెఎసి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సోమన్నను చట్టవిరుద్ధంగా గొలుసులతో బంధించడాన్ని జెఎసి ఖండించింది. నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తుల పట్ల సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి వ్యహరించాల్సి ఉండాల్సిందని జెఎసి పేర్కొంది. సోమన్న విషయంలో రాజకీయ వత్తిళ్లకు పోలీసులు లొంగిపోయి సుప్రీంకోర్టు తీర్పును, చట్టాన్ని తుంగలో తొక్కారని ఆరోపించింది. పోలీసులను రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోవడం సరికాదని హెచ్చరించింది.

ఆదివారం తెలంగాణ జెఎసి స్టీరింగ్ మిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశలో ఏడు అంశాలపై తీర్మానాలను ఆమోదించారు. గత అమరుల స్ఫూర్తి యత్ర విజయవంతమైందని జెఎసి అభిప్రాయపడింది.

సెప్టెంబరు 9 నుండి 12 వరకు ఆదిలాబాద్ బాసర లో స్పూర్తియాత్ర ప్రారంభమయి మంచిర్యాల లో ముగుస్తుందని, ఈ యాత్రలో ప్రజలు అందరూ పాల్గొని ఈ యాత్ర నుంవిజయవంతం చేయాలని పిలుపునిచ్చింది జెఎసి.

నిరుద్యోగ సమస్య ను పరిష్కరించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగాల భర్తీ కి అక్టోబర్ రెండో వారం లో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించింది.

గ్రామాల్లో జేఏసీ ని బలోపేతం చేయాలనీ నిర్ణయించింది. సెప్టెంబర్ 17 ను విలీన దినోత్సవంగా పాటించాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 ను విలీన దినం గా ప్రభుత్వం ప్రకటించి పాటించాలని డిమాండ్ చేసింది.

Cps స్కీమ్ ను రద్దు చేయాలని, దీని వల్ల ఉద్యోగులు నష్టపోతున్నాని జెఎసి ఆందోళన వ్యక్తం చేసింది. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరింది.

రైతు సమన్వయ సమితి లు రైతాంగానికి తీరని ప్రమాదాన్ని కొనితెచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది జెఎసి. జివో నంబర్39 రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ జీవో విషయంలో ప్రభుత్వానికే స్పష్టత లేదని ఎద్దేవా చేసింది. సమగ్ర వ్యవసాయ విధానం తీసుకు రావాలని సూచించింది.  గ్రామీణ వ్యవసాయం లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది.

ఇక కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఒక్క మంత్రి దత్తాత్రేయను తొలగించి ఇంకెవరికీ మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయమని ప్రకటించింది జెఎసి.

 . కేంద్రం తెలంగాణకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయం అని పేర్కొంది. సమావేశంలో జెఎసి చైర్మన్ కోదండరాం, రఘు సహా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి