తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ ఈ ఎన్సీ లేఖ

తుంగభద్ర  బోర్డకు తెలంగాణ ప్రభుత్వం  లేఖ రాసింది.  కృష్ణా ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్దంగా  ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని  ఆ లేఖలో  తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఆరోపించింది.  
 

Telangana Irrigation Engineer in Chief Writes letter To Tungabhadra Board

హైదరాబాద్: తుంగభదద్ర బోర్డు కుతెలంగాణ ఇరిగేషన్  శాఖ  ఈఎన్సీ  మురళీధర్ రావు  మంగళవారం నాడు లేఖ రాశాడు. కృష్ణా జలాలను  కేసీ  కేనాల్‌కి తరలించాలని  ఏపీ ప్రభుత్వం భావిస్తుందని  ఆ లేఖలో  ఆయన పేర్కొన్నారు.  కృష్ణా ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్దంగా  నీటి తరలింపునకు  ఏపీ సర్కార్  ప్రయత్నాలు  చేస్తుందని  ఆ లేఖలో  తెలంగాణ ఇరిగేషన్  శాఖ తెలిపింది.  సుంకేసుల ద్వారా  తుంగభద్ర జలాలను  వినియోగించాలని  తెలంగాణ ప్రభుత్వం  కోరింది. 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  నీటి వివాదాలపై  వివాదం  సాగుతుంది.  ఈ విషయమై  రెండు  రాష్ట్రాలు పరస్పరం  ఫిర్యాదులు  కూడా చేసుకున్నాయి. ప్రస్తుత నీటి  సంవత్సరంలో  నీటి వినియోగంపై  లెక్కలు తేల్చాలని  కృష్ణా నది యాజమాన్య  బోర్డును   తెలంగాణ కోరింది.  గత వారంలో  హైద్రాబాద్ లో జరిగిన కేఆర్ఎంబీ  సమావేశంలో  తెలంగాణ ఈ మేరకు డిమాండ్  చేసింది.  

కృష్ణా, గోదావరి నదులపై  నిర్మిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణాలపై   రెండు రాష్ట్రాలు  పరస్పరం  ఫిర్యాదులు  చేసుకున్నాయి.  ప్రాజెక్టులను  బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని  ఏపీ ప్రభుత్వం  డిమాండ్  చేస్తుంది.  ప్రాజెక్టులకు నీటి  కేటాయింపులు  లేకుండా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడాన్ని  తెలంగాణ తీవ్రంగా  వ్యతిరేకిస్తుంది. 

రాష్ట్రానికి నీటి కేటాయింపుల  విషయమై  కూడా తెలంగాణ ప్రభుత్వం  కేంద్రం వద్ద  డిమాండ్  చేస్తుంది.  ఈ విషయమై  సుప్రీంకోర్టులో  తెలంగాణ ప్రభుత్వం  పిటిషన్ దాఖలు చేసింది.  ఈ విషయమై  సుప్రీంకోర్టులో కేసును వెనక్కి తీసుకోవాలని  కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో  ఈ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios