తెలంగాణలో ఇంటర్మీడియట్ (Intermediate) విద్యార్థులకు మార్చి నెలలో ప్రాక్టికల్ పరీక్షలు (Practical examinations) నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు అధికారులు నిర్ణయం తీసుకన్నారు. ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం కవర్ చేస్తూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నామని.. త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ (Intermediate) విద్యార్థులకు మార్చి నెలలో ప్రాక్టికల్ పరీక్షలు (Practical examinations) నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు అధికారులు నిర్ణయం తీసుకన్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష తరగతులు కొనసాగుతున్నందున.. విద్యార్థులకు సంబంధిత కాలేజ్‌ల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. కోవిడ్ ఉధృతి కారణంగా.. గతేడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ ఆధారిత అసైన్‌మెంట్‌లుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. రెగ్యూలర్ స్ట్రీమ్‌ల విద్యార్థులకు పూర్తి మార్కులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం విద్యార్థులు సంబంధిత కాలేజ్‌లో ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది మొత్తం సిలబస్‌లో 70 శాతం కవర్ చేస్తూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నామని.. త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలలో అసైన్‌మెంట్ల ద్వారా విద్యార్థులకు మార్కులను అంచనా వేయనున్నారు. విద్యార్థులకు అసైన్‌మెంట్‌లు ఇళ్ల వద్ద పూర్తి చేసి.. సంబంధిత కాలేజీల్లో సమర్పించాల్సి ఉంటుంది.
ఇక, మే నెలలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది కూడా మొత్తం సిలబస్‌లో 70 శాతాన్ని కవర్ చేస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థులకు ప్రశ్నలలో ఎంపికలు ఇవ్వనున్నారు. ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు గడువు నేటితో (ఫిబ్రవరి 4) ముగియనుంది. విద్యార్థులు ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీలోపు రూ. 200 ఆలస్య రుసుముతో, ఫిబ్రవరి 11 నుంచి 17వ తేదీ లోపు రూ. 1000 ఆలస్య రుసుముతో, ఫిబ్రవరి 18 నుంచి 24 లోపు రూ. 2,000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది
