Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఇంటర్ పరీక్షా విధానంలో కీలక మార్పులు: అకడమిక్ ఇయర్ ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది.ఈ దఫా అర్ధవార్షిక పరీక్షలతో పాటు ఫ్రీ ఫైనల్ పరీక్షలను కూడ నిర్వహించనున్నారు.ఇంటర్ పరీక్షా విధానంలో ఈ దఫా కీలక మార్పులు  చేసింది.

Telangana Intermediate board releases academic year
Author
Hyderabad, First Published Sep 6, 2021, 7:27 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. ఆన్‌లైన్ తరగతులతో కలిపి 220 పని దినాలను ఈ విద్యాసంవత్సరానికి ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి  23 నుండి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 1 వరకు తొలి టర్మ్ ను  ఆ తర్వాత రెండో టర్మ్ ను నిర్వహించనున్నట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.డిసెంబర్ 13 నుండి 18 వరకు అర్ధవార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి 18 వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.

దసరా పండుగకు ఆదివారంతో కలిపి ఐదు రోజులు మాత్రమే సెలవులను బోర్డు ప్రకటించింది. సంక్రాంతికి  జనవరి 13 నుండి 15 వరకు సెలవులను ఇచ్చింది.  అర్ధసంవత్సర పరీక్షలతో పాటు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. మే చివరి వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ఇంటర్ బోర్డు తెలిపింది. ఏప్రిల్ 14 నుండి  మే 8వ 31 వరకు వేసవి సెలవులుగా ఇంటర్ బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది జూన్ 1 నుండి ఇంటర్ కాలేజీలను పున: ప్రారంభించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios