ఈ ఏడాది ఏప్రిల్ 20 నుండి మే 5 వరకు ఇంటర్ పరీక్షలను (TS Inter Exams) నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరీక్షల్లో విద్యార్థులకు ప్రశ్నల ఛాయిస్ రెట్టింపు చేయాలని నిర్ణయించింది. 

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుండి మే 5 వరకు ఇంటర్ పరీక్షలను (TS Inter Exams) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే గతేడాది నిర్వహించిన పరీక్షల్లో చాలా మంది ఫెయిల్‌ కావడంతో ఛాయిస్‌ ప్రశ్నలు పెంచి మోడల్‌ ప్రశ్నపత్రాలను ఇంటర్ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది పరీక్షల్లో విద్యార్థులకు ప్రశ్నల ఛాయిస్ రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది.

గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే ఛాయిస్‌ ప్రశ్నలు ఇవ్వగా.. ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచడంతో పాటుగా ఛాయిస్‌గా వదిలేసుకొనే అవకాశం కల్పించింది. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్‌ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. గత ఏడాది మూడు సెక్షన్లకు రెండింటిలో మాత్రమే 50 శాతం ఛాయిస్‌ ప్రశ్నలు ఇవ్వగా.. ఇప్పుడు మూడు సెక్షన్లలో ఛాయిస్‌ ప్రశ్నలు ఇచ్చారు. ప్రస్తుతం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులు అయిన సంగతి తెలిసిందే.

ఇక, మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎథిక్స్, హ్యుమన్ వాల్యూస్ అండ్ ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. 

ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌.. ఏప్రిల్ 20 న పేపర్-1 తెలుగు/ సంస్కృతి, ఏప్రిల్ 22 న ఇంగ్లీష్ పేపర్-1, ఏప్రిల్ 25న మాథ్స్ పేపర-1A, బొటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్-1B జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్1, ఏప్రిల్ 29న ఫిజిక్స్ పేపర్-1, ఎకానమిక్స్ పేపర్-1, మే 2న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్.. ఏప్రిల్ 21న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2, ఏప్రిల్ 23 న ఇంగ్లిష్‌ పేపర్-2, ఏప్రిల్ 26న మాథ్స్ పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2, ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్-2B, జూవాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2, ఏప్రిల్ 30న ఫిజిక్స్ పేపర్-2, ఎకానమిక్స్ పేపర్-2, మే 5న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్-2