పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) వ్యవహారాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తం అయింది. పీఎఫ్‌ఐ కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టింది.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) వ్యవహారాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తం అయింది. పీఎఫ్‌ఐ కార్యకర్తలు దాడులు చేసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టింది. కేరళ, తమిళనాడులలో ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నినట్టుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థలపై నిఘా ఉంచాలని హెచ్చరించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను పోలీసులు అలర్ట్ చేశారు.