Asianet News TeluguAsianet News Telugu

జానారెడ్డి, షబ్బీర్‌లకు ఇంటెలిజెన్స్ నోటీసులు, టీఆర్ఎస్‌లో కొందరికి కూడా...

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే.. ఓటమి భారంతో క్రుంగిపోయి ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలకు మరో షాక్ తగిలింది.  వీరిద్దరికి తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నోటీసులు పంపింది. 

telangana intelligence notices to congress Leaders janareddy and shabirali
Author
Hyderabad, First Published Jan 6, 2019, 10:57 AM IST

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే.. ఓటమి భారంతో క్రుంగిపోయి ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలకు మరో షాక్ తగిలింది.  వీరిద్దరికి తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నోటీసులు పంపింది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగించిన వీరిద్దరూ రోజువారీ అద్దెతో పాటు డ్రైవర్ భత్యం కింద రూ.9 లక్షలు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం 2007లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో భద్రత నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూర్చుకున్న నేతలు తప్పనిసరిగా సంబంధిత వాహనాల అద్దెతో పాటు డ్రైవర్లకు జీతభత్యం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

దీనిని అనుసరించి జానా, షబ్బీర్ అలీలకు నోటీసులు పంపినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7 వరకు జానారెడ్డి, షబ్బీర్ అలీలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించారు.

జానారెడ్డి 11,152 కిలోమీటర్లు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,20,924 చెల్లించాలని, అలాగే షబ్బీర్ అలీ 12,728 కిలోమీటర్లు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,79,936 చెల్లించాలని  నోటీసులో పేర్కొన్నారు.

అలాగే అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఇతర ప్రముఖులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడినందున వారికి కూడా ఇంటెలిజెన్స్ విభాగం నోటీసులు పంపినట్లు తెలిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios