తెలంగాణలో ఐసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి బుధవారం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.
తెలంగాణలో ఐసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి బుధవారం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.
ధ్రువపత్రాల పరిశీలనకుగాను ఈ నెల 6 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని.. 8 నుంచి 12 వరకు పరిశీలన ఉంటుందని తెలిపింది. 15వ తేదీన మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నట్లు మండలి స్పస్టం చేసింది.
అలాగే ఈ నెల 22 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించింది. 22న స్లాట్ బుకింగ్, 23న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చని వివరించింది.
26న చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు అనంతరం 28న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి గైడ్‌లైన్స్ జారీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వివరించింది.