Asianet News TeluguAsianet News Telugu

మరియమ్మ లాకప్‌డెత్ కేసు: దర్యాప్తు సీబీఐ చేతికి ఇవ్వాలా, వద్దా... తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలా లేదా అన్న అంశంపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. 

telangana high court verdict reserved for CBI probe into Mariamma lockup death
Author
Hyderabad, First Published Nov 22, 2021, 5:24 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలా లేదా అన్న అంశంపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. విచారణకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సీబీఐ ఎస్పీ, ఐబీ అధికారి హాజరయ్యారు. ఈ కేసులో బాధ్యులైన ఇద్దరు పోలీస్ అధికారులను విధుల నుంచి తొలగించినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే తెలంగాణ పోలీసులపై ప్రజలకు విశ్వాసం  సన్నగిల్లే అవకాశం వుందని ఏజీ  ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. 

అంతకుముందు నవంబర్ 10 న జరిగిన విచారణ సందర్భంగా (mariyamma lockup death)  తెలంగాణ హైకోర్టు (telangana high court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు సీబీఐకి (cbi) అప్పగించదగిన కేసని అభిప్రాయపడింది. ఈ నెల 22న విచారణకు హాజురుకావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించాలని ఏజీకి (advocate general of telangana) ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐ, కానిస్టేబుల్‌లను విధుల నుంచి తొలగించినట్లు ఏజీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం బాధ్యులైన క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించింది. 

ALso Read:మరియమ్మ లాకప్‌డెత్ కేసు: గుండె ఆగిపోయేలా కొడతారా... సీబీఐ దిగాల్సిందే, తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు

కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని (yadadri bhuvanagiri district) అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో  (addagudur lockup death) కస్టోడియల్ డెత్‌కు గురైన మరియమ్మ కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు ఇప్పటికే చర్యలు తీసుకొన్న సంగతి తెలిసిందే. ముగ్గురిని సర్వీస్ నుండి  తొలగిస్తూ రాచకొండ సీపీ (rachakonda police commissionerate) మహేష్ భగవత్ (mahesh bhagwat) ఈ ఏడాది జూలైలో ఉత్తర్వులు జారీ చేశారు. 

ఖమ్మం జిల్లా (khammam district) చింతకాని (chintakani) సమీపంలోని కోమట్లగూడెం గ్రామానికి చెందిన మరియమ్మ ఆమె కొడుకు ఉదయ్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చర్చిలో పనిచేసేవారు. అయితే చర్చిలో పనిచేసే సమయంలో  డబ్బులు పోయాయని చర్చి ఫాదర్  ఫిర్యాదు మేరకు  ఈ ఏడాది జూన్ 18వ తేదీన  ఉదయం 7:45 గంటలకు మరియమ్మతో పాటు ఆమె కొడుకు ఉదయ్, అతని స్నేహితుడు శంకర్ లను అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు.

అయితే పోలీసులు కొట్టిన దెబ్బలకు తన తల్లి మరియమ్మ తన చేతుల్లోనే చనిపోయిందని ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో డీజీపికి ఈ విషయాన్ని ఉదయ్ తెలిపారు. అటు మరియమ్మ కస్టోడియల్ డెత్  అంశంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (bhatti vikramarka) పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ను (kcr) కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై ఇప్పటికే  ఎస్ఐ మహేశ్వర్, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్  ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios