హైదరాబాద్: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు స్టే విధించింది. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో 111 జీవోకు విరుద్దంగా నిర్మాణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.

also read:తప్పుడు ప్రచారంపై న్యాయపరంగా ఎదుర్కొంటా: ఎన్జీటీ నోటీసులపై కేటీఆర్

ఈ వ్యవసాయ క్షేత్రం తనది కాదని కేటీఆర్ చెప్పారు. ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తానని కూడ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇటీవల ప్రకటించారు.ఎన్టీటీ ఇచ్చిన నోటీసులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవాలు తెలుసుకోకుండానే నోటీసులు జారీ చేశారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

also read:కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు: ఫామ్‌హౌస్‌పై నిజ నిర్ధారణ కమిటీ నివేదిక

రాజకీయ దురుద్దేశ్యంతోనే కొందరు ఎన్జీటీని ఆశ్రయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ వ్యవసాయ క్షేత్రం తనది కాదని ఆయన హైకోర్టుకు తేల్చి చెప్పారు.దీంతో ఎన్జీటీ నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టే తీర్పు కాపీ వచ్చిన తర్వాత స్పందిస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించారు.