Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్-1 రద్దు: రూల్స్ మీరే ఉల్లంఘిస్తే ఎలా?.. టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలమైందని పేర్కొంది.

telangana High Court Serious on TSPSC Over Group 1 Exam ksm
Author
First Published Sep 26, 2023, 1:23 PM IST | Last Updated Sep 26, 2023, 1:23 PM IST

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలమైందని పేర్కొంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై టీఎస్‌పీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌‌లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్ష నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగా బయోమెట్రిక్ ఎందుకు అమలు  చేయలేదని ప్రశ్నించింది. నోటిఫికేషన్‌ను అమలు చేయకుండా, రూల్స్‌ను ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించింది. 

గతంలో పేపర్ లీక్ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దైన అంశాన్ని గుర్తుచేస్తూ.. ఒకసారి పరీక్ష రద్దయ్యాక, మరింత జాగ్రత్తగా ఉండాలి కదా అని హైకోర్టు పేర్కొంది. పరీక్షలపై ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారని టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉందని తెలిపింది. ఈ పరిణామాలతో గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారాయని పేర్కొంది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. 

ఇక, గతంలో పేపర్ లీక్‌ కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దైన సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ మరోసారి నిర్వహించింది. అయితే పరీక్ష సమయంలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, నిర్వాహణ అనుమానస్పదంగా ఉందని  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆలూరు గిరిధర్ రావు వాదిస్తూ.. నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించే సమయంలో టీఎస్‌పీఎస్సీ అధికారులు బయోమెట్రిక్ వివరాలను సేకరించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థులకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లలో హాల్ టికెట్ నెంబర్లు లేవని చెప్పారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన జస్టిస్ పి మాధవీ దేవి నేతృత్వంలోని తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్..  గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వెంటనే రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. అయితే రెండు సార్లు గ్రూప్-1 పరీక్ష రద్దు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios