Asianet News TeluguAsianet News Telugu

వినాయక నిమజ్జనంపై హైకోర్టు సీరియస్ కామెంట్స్: జీహెచ్ఎంసీ, హైద్రాబాద్ సీపీపై సీరియస్


వినాయకనిమజ్జనం ఆంక్షలపై తీర్పును తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ, హైద్రాబాద్ సీపీపై కూడ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telangana High court serious comments on Vinayaka idol immersion
Author
Hyderabad, First Published Sep 7, 2021, 12:47 PM IST

హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఆంక్షలపై  తీర్పును తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ, హైద్రాబాద్ సీపీతో పాటు ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను లక్ష మట్టి గణేష్ విగ్రహలు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సలహాలు కాదు చర్యలు స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని హైకోర్టు ప్రభుత్వం తీరుపై కామెంట్స్ చేసింది. 

 

విచారణకు పది నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.హైద్రాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ద లేనట్టుందని హైకోర్టు అడిగింది. జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ఈ విషయమై  తీర్పును రిజర్వ్ చేసినట్టుగా హైకోర్టు ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios