Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో రెండో దశ కరోనా ముప్పు పొంచి ఉంది : తెలంగా హైకోర్టు

 రాష్ట్రంలో రెండో దశ కరోనా ముప్పు పొంచి ఉందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.

Telangana High court serious comments on government over corona cases lns
Author
Hyderabad, First Published Nov 19, 2020, 3:06 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో రెండో దశ కరోనా ముప్పు పొంచి ఉందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.

గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కరోనా కేసులపై విచారణ నిర్వహించింది. కరోనా టెస్టులు తక్కువ నిర్వహించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టు కేసులున్నప్పుడే కేసులు పెంచి.. ఆ తర్వాత తగ్గించినట్టుగా కన్పిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది.రాష్ట్రంలో రోజూ లక్ష టెస్టులు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కరోనా మార్గదర్శకాలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.అధిక బిల్లులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై  ఏం చర్యలు తీసుకొన్నారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది.

కరోనాపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రణాళికలు ఎందుకు సమర్పించలేదని హైకోర్టు ప్రశ్నించింది.కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి అసలు ప్రణాళిక లేదని భావించాలా అని అడిగింది.ఐసీఎంఆర్ సూచించిన కరోనా పరీక్షలను తెలంగాణలో ప్రారంభించాలని సూచించింది.ఈ విషయమై ఈ నెల 24 వతేదీలోపుగా నివేదిక ఇవ్వాలని  ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

కరోనా విషయంలో గతంలో కూడ హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పు బట్టిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios