హైదరాబాద్: సీఏఏ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన  హైద్రాబాద్ పాతబస్తీలో సభ నిర్వహణకు  హైకోర్టు షరతులతో  అనుమతి లభించింది. 

ఈ సభకు ముందుగా పోలీసులు  అనుమతి ఇచ్చారు. ఈ అనుమతిని సవాల్ చేస్తూ  మహేంద్ర అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం నాడు షరతులతో అనుమతి ఇచ్చింది.

Also read:బీజేపీకి చెక్: హైద్రాబాద్‌‌లో భారీ సభ,కేసీఆర్ ప్లాన్ ఇదీ

సీఏఏ రద్దును డిమాండ్ చేస్తూ బిల్లు ఈ నెల 25వ తేదీన పాతబస్తీలో  ఎంఐఎం భారీ ర్యాలీ, సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ సభను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైద్రాబాద్ లో ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ సభను మొత్తం వీడియో తీయాలని హైకోర్టు ఆదేశించింది.  

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోవాలని ఎంఐఎం భావిస్తోంది.ఈ విషయమై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఎంఐఎం ఇటీవల సమావేశమయ్యారు.సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కేసీఆర్‌తో  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చర్చించారు.  

రాష్ట్రంలో పలు జిల్లా కేంద్రాల్లో  కూడ ఎంఐఎం సభలు నిర్వహించింది. ఈ సభలకు కొనసాగింపుగానే ఎంఐఎం పాతబస్తీలో ఈ నెల 25వ తేదీన సభకు పూనుకొంది. ఈ సభకు హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది.