పబ్ ల ముందు హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే పబ్ యాజమానులదే బాధ్యత అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.
హైదరాబాద్: పబ్‌ల ముందు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు పబ్ యజమానులకు సూచించింది.జనావాసాల మద్య Pubల ఏర్పాటును సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ వేల్వేర్ అసోసియేషన్ Telangana High courtలో విచారణ నిర్వహించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. మద్యం సేవించిన వారికి Driversను అందుబాటులో ఉంచాలని కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
పోలీసుల పనితీరు బాగుందని హైకోర్టు ప్రశంసించింది. తాగి వాహనాలు నడిపితే పబ్ యాజమాన్యానిదే బాధ్యతగా హైకోర్టు తేల్చి చెప్పింది. పబ్‌ల్లో శబ్ద కాలుష్యం 45 డెసిబుల్స్ కి మించరాదని కోరింది.ఎక్సైజ్ శాఖను కూడా ప్రతివాదులుగా చేర్చాలని పోలీస్ శాఖ హైకోర్టును కోరింది. వచ్చే ఏడాది జనవరి 4 వరకు ఆంక్షలను అమలు చేయాలని కూడా హైకోర్టు ఆవేశించింది.మైనర్లను పబ్ లోపలికి అనుమతించవద్దని కూడా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా అమలు చేయాలని హైకోర్టు కోరింది.మైనర్ల తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటు విషయమై జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ వేల్ఫేర్ అసిసోయేషన్ ఈ నెల 16న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్, పోలీసుల మార్గదర్శకాలను కూడా పాటించాలని పబ్ లకు హైకోర్టు స్పష్టం చేసింది. పబ్ లలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. దీంతో ఈ విషయమై హైకోర్టు మద్యం తాగిన వారికి డ్రైవర్లను కేటాయించాలని పబ్ లకు ఆదేశించింది.
ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా నగరంలోని 800 జూబ్లీ,హైలైఫ్, బ్రెవింగ్ కంపెనీ, పర్జీ కెఫే, అమ్నిషీయా లాంజ్, డైలీ డోస్ బార్ హాఫ్, డర్టీ మార్టినీ కిచెన్ , బ్రాడ్ వే పబ్, మ్యాకే బ్రో వరల్డ్ కాపీ బార్, పబ్ లకు గతంలోనే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పబ్‌ల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని అప్పటి హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. కొన్ని పబ్‌లపై ఫిర్యాదులు అందాయన్నారు. పబ్ ల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని ఆయన కోరారు. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసకొంటామన్నారు. రూల్స్ పాటించకుండా అర్ధరాత్రి వరకు నడిపే పబ్‌లపై చర్యలు తీసుకొంటామన్నారు. పబ్‌ల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని సీపీ తెలిపారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.
