డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై రెడు నెలల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం. కేంద్రం నిధులతో లక్ష ఇళ్లు నిర్మించారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం సోమవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలో Double Bed Room ఇళ్లను నిర్మించి కూడా లబ్దిదారులకు ఇంకా కేటాయించలేదని BJP నేతలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో 1 లక్ష ఇళ్లను నిర్మించి కూడా ఈ ఇళ్లను ఇంకా లబ్దిదారులకు కేటాయించలేదని బీజేపీ నేత Indrasena Reddy ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే లబ్దిదారులకు ఇళ్లను కేటాయించలేదని కూడా పిటిషనర్ ఆరోపించారు. అయితే వీలైనంత త్వరగానే లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది Telangana High Court ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు. ఎన్ని కేటాయించారనే విషయాన్ని తెలపాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
