Asianet News TeluguAsianet News Telugu

దీపావళి బాణసంచా కాల్చడంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

దీపావళిని పురస్కరించుకొని బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Telangana High court orders to government ban on crackers lns
Author
Hyderabad, First Published Nov 12, 2020, 2:23 PM IST


హైదరాబాద్: దీపావళిని పురస్కరించుకొని బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

దీపావళి బాణసంచాపై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలిచ్చింది.దీపావళిని పురస్కరించుకొని టపాసులు కాల్చకుండా ఆదేశాలివ్వాలని గురువారం నాడు హైకోర్టులో పిల్ దాఖలైంది.

 

ఈ పిల్ పై విచారణ చేసిన హైకోర్టు టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో ఇంకా కరోనా కేసులు ఉన్నాయని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో టపాసులు కాల్చకుండా  నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

బాణసంచాను కాల్చడం వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతారని పిటిషనర్ వాదించాడు.పిటిషనర్ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకొంది.ప్రస్తుత పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయాలన్న తెలంగాణ హైకోర్టు  ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రస్తుతం తెరిచిన బాణసంచా దుకాణాలను మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది.

ఎవరైనా బాణసంచా అమ్మితే కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు దీపావళి టపాసులను బ్యాన్ చేయాలని ఆదేశించిందని హైకోర్టు ఈ పిల్ విచారణ సమయంలో ప్రస్తావించింది.

కోల్‌కత్తా లో కూడా బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచ్చిందని హైకోర్టు ఈ  సందర్భంగా గుర్తు చేసింది.ప్రసార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవవగాహన కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.

క్రాకర్స్ నిషేధం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకొన్నారో ఈ నెల 19వ తేదీన తమకు తెలపాలని హైకోర్టు కోరింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios