Asianet News TeluguAsianet News Telugu

అధిక ఫీజులు: ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు హైకోర్టు ఆదేశం

అపోలో, బసవతారకం ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 

Telangana high court orders to action on private hospitals who violated rules
Author
Hyderabad, First Published Aug 5, 2020, 3:05 PM IST


హైదరాబాద్: అపోలో, బసవతారకం ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్ధేశించిన ఫీజుల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ రెండు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలంగాణ హైకోర్టులో బుధవారం నాడు పిల్ దాఖలైంది.ఈ పిల్ పై హైకోర్టు విచారణ చేసింది. ప్రభుత్వ షరతులను అపోలో, బసవతారకం ఆసుపత్రులు ఉల్లంఘించాయని పిటిషనర్ ఆరోపించారు. 

అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని  పిటిషనర్ ఆరోపించారు.  అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మరో వైపు ఈ రెండు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణలో కరోనా రోగులకు చికిత్స చేసిన రెండు ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. డెక్కన్ ఆసుపత్రితో పాటు విరంచి ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఈ రెండు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స చేయవద్దని సర్కార్ ఆదేశించింది. పలు ఆసుపత్రులపై రోజూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.ఈ ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకొంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios