మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన దేవరయంజాల భూములపై విచారణకు ప్రభుత్వం వేసిన విచారణ కమిటీపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నలుగురు అధికారులతో కమిటీ వేయడం అవసరమా అని అడిగింది.
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ దేవరయంజాల్ లో ఆలయ భూములను ఆక్రమించారనే ఆరోపణపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కమిటీ వేయడంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవర యంజాల్ భూములపై విచారణకు ప్రభుత్వం నలుగురు అధికారులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే.
నలుగురు అదికారులతో కమిటీ వేస్తూ ఈ నెల 3వ తేదీన జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టలో రైతులు పిటిషన్లు వేశారు. ఆ జీవోను ప్రస్తావిస్తూ... కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇంత హడావిడి అవసరమా అని హైకోర్టు ప్రశ్నించింది. మిగిలిన ఆలయ భూముల సంగతేమినటని ప్రశ్నించింది.
తమ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి చనిపోతే స్మశానానికి వెళ్లడానికి ఎంతో సమయం పట్టిందని అంటూ నలుగురు అధికారులతో ఇప్పుడు కమిటీ ఎందుకని న్యాయమూర్తి అడిగారు. మీడియాలో వచ్చిన వార్తాకథనాల ఆధారంగా జీవోలు జారీ చేస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తోోందని, చట్టబద్దంగానే వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
విచారణ మాత్రమే జరుగుతోందని అడ్వొకేట్ జనరల్ (ఏజ) కోర్టుకు తెలియజేశారు. ఎవరినీ ఖాళీ చేయించడం లేదు, ఆక్రమించడం లేనది చెప్పారు.
దేవరయంజాల్ లో ఈటల రాజేందర్ ఆలయ భూములను అక్రమించుకున్నారనే ఆరోపణపై ప్రభుత్వం విచారణకు నలుగురు అధికారులతో కమిటి వేసింది. దానికి మెదక్ జిల్లాలోని అచ్చంపేట అసైన్డ్ భూములను అక్రమించారనే ఆరోపణపై విచారణ చేయించి, ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం తేల్చింది.
ఆ విచారణ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. అచ్చంపేట భూములపై కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్టు తేల్చింది. తిరిగి పద్ధతి ప్రకారం విచారణ జరపాలని ఆదేశించింది. ఆ తర్వాత వెంటనే దేవరయంజాల భూములైప విచారణకు కమిటీ వేశారు.
