Asianet News TeluguAsianet News Telugu

మెడికల్ కాలేజీల్లో ‘‘స్థానిక రిజర్వేషన్’’.. ఏపీ విద్యార్దుల పిటిషన్, తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

వైద్య కాలేజీల్లో తెలంగాణ స్థానిక విద్యార్ధులకు రిజర్వేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్ధులకేనని కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీవో నెం 72ను  జారీ చేసిన సంగతి తెలిసిందే.

telangana high court key verdict on reservation for local students in medical colleges ksp
Author
First Published Sep 11, 2023, 8:48 PM IST

వైద్య కాలేజీల్లో తెలంగాణ స్థానిక విద్యార్ధులకు రిజర్వేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్థానిక విద్యార్ధులకు రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా న్యాయస్థానం సమర్ధించింది. కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్ధులకేనని కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీవో నెం 72ను  జారీ చేసిన సంగతి తెలిసిందే. అఖిల భారత స్థాయి కోటాలో 15 శాతం పోగా మిగిలిన 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్ధులకేనని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీకి చెందిన కొందరు విద్యార్ధులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఏపీ విద్యార్ధుల పిటిషన్లను కొట్టివేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios